Wednesday, March 4, 2020

MEDICAL ETHICS.మెడికల్ ఎథిక్స్

               మెడికల్ ఎథిక్స్ - వైద్య వృత్తి నియమావళి
మెడికల్  వృత్తి లో ఉన్న కట్టుబాట్లనే మెడికల్ ఎథిక్స్ అంటారు.  
2002 లో   మెడికల్ కౌన్సిల్ (కోడ్)  నియమావళి ని  రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2016 వరకు రెండుసార్లు సవరణలు కూడా చేసింది. 
  మెడికల్ ఎథిక్స్ అంటే ఏమిటి ?
వైద్యుడు, రోగులతో, తోటి వైద్యులతో, హాస్పిటల్ లో పనిచేసే నర్సింగ్ ,పారామెడికల్ స్టాఫ్ తో ,అలాగే పబ్లిక్ తో , ప్రభుత్వ అధారిటీ తో ఎలా మెలగాలో,ఎలా నడుచుకోవాలో , చట్టాలకు లోబడి సేవలు ఎలా  అందించాలో  తెలియ చెప్పే నియమావళి ని మెడికల్ ఎథిక్స్ అంటారు.
                                    నియమావళి . 
  • ప్రతి వైద్యుడికీ , నీతి ,నిజాయితీ, కరుణ, ప్రేమ , వినయం వీటన్నింటినీ మించి వైద్య నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. రోగుల కు  క్షమ, దయ,ప్రేమ  తో  వైద్య సేవలు అందించాలి.  
  • మెడికల్ రికార్డ్ లు కనీసం 3 ఏళ్లపాటు భద్రపరచాలి. 
  • వైద్యానికి సంబంధించిన సమాచారాన్ని వారు కోరితే, 3 రోజుల్లో రోగికి,వారి లీగల్ వారసులకు ఇవ్వాలి.అంతేకాక, అవసరమైతే కోర్టులకు కూడా ఇవ్వాలి. 
  • ఫీజు వివరాల తో పాటు అందించే వైద్యం గురించిన సమస్త  సమాచారం రోగికి,వారి బంధువులకు తెలియచెప్పి అనుమతి(Informed Consent) పొందిన  తర్వాతమాత్రమే వైద్యసేవలు అందించాలి.
  • తోటి వైద్యుల ను విమర్సించరాదు .
  • MCI గుర్తింపు ఉన్న డిగ్రీ లను మాత్రమే ప్రదర్శించాలి.
  • మెడికల్ సర్టిఫికెట్ లు ఇవ్వడం లో వాస్తవ స్థితి ని మాత్రమే ప్రతిబింబించాలి.
  • నోటిఫయబుల్  వ్యాధులను గుర్తించిన వెంటనే జిల్లా ఆరోగ్య అధికార్లకు తెలియచేయాలి.
  • ప్రతి  5ఏళ్లకు కనీసం 30 CME  క్రెడిట్స్ సంపాదించాలి.
  •  జనరిక్ మందులను  వాడాలి. చేతివ్రాత బోల్డ్ ఫాంట్స్ లో ఉండాలి.
  • అత్యవసర కేసులకు ప్రాధమిక సాయం అందించి వెంటనే రిఫెరల్ హాస్పిటల్ కి పంపాలి.
  • రోగి అనుమతి లేకుండా రోగివివరాలు,వైద్య వివరాలు ఎవ్వరికీ తెలియచేయకూడదు,ప్రచురించ కూడదు. 
  • ప్రొప్రయిటరి ఫార్ములా తెలియని మందులను వాడకూడదు
  • సరైన లీగల్ నియమావళి పాటించకుండా కారుణ్యమరణాలకు సాయం చేయకూడదు .
  • లింగనిర్ధారణ పరీక్షలు, 5 నెలలు (ఇప్పుడు 6నెలలు అంటున్నారు) నిండినతర్వాత అబార్షన్ లు చేయకూడదు.
  • జీవకాలుష్య నియంత్రణ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.(అనగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి మరియు బయో వ్యర్ధాలు ప్రాసెస్ చేసే కంపెనీతో అగ్రిమెంట్ ). 
  • మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలలో ప్రాక్టీస్ చేస్తుంటే, అగ్నిమాపక నిరోధ చట్టానికి అనుగుణ్యమైన  NOC ఉండాలి.
  • అర్హత లేకుండా స్పెషలిస్ట్ ల మని చెప్పుకో కూడదు. అది మోసం!విదేశీ గ్రాడ్యు యేట్స్ తమ M.D.(Equal to Indian MBBS) )డిగ్రీని PG  డిగ్రీగా ప్రదర్శిస్తూ, స్పెషలిస్టు లమని చెబుతూ  ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
  • ఆరోగ్యరంగానికి సంబంధించిన చట్టాలపై కనీస  అవగాహన కలిగివుండాలి.
  • IMA or Speciality MEDICAL ASSOCIATION లో సభ్యత్వం ఉండాలి.
  • ప్రయివేట్ ప్రాక్టీస్ చేస్తూ మెడికల్ కాలేజీలలో ఫాకల్టీ గా ఉండకూడదు. అలాగే షాడో ఫాకల్టీ గా కూడా  ఉండకూడదు.
  • ప్రభుత్వ వైద్యులు ప్రయివేట్ ప్రాక్టీస్ చేయకూడదు.
  • కోవిడ్ లాంటి పాండెమిక్ లో మన వైద్యుల ప్రవర్తన మరింత బాధ్యతా యుక్తం గా ఉండాలి. వ్యక్తి స్వేచ్ఛ కంటే సమాజ శ్రేయస్సు కే ప్రయారిటీ ఇవ్వాలి. 
  • వైద్యవృత్తిని వ్యాపారం గా చేయకూడదు. కానీ నేటి కాలం లో టెక్నాలజీ, మౌలిక సదుపాయాల కల్పన అనేది డబ్బు తో కూడిఉండటం చేత హాస్పిటల్ నిర్వాహకులు తప్పనిసరిగా వ్యాపార దృక్పధం తోనే వైద్యసేవలు అందించవలసి వస్తుంది.
  • ప్రమాదాలు,  క్రానిక్ జబ్బులు , ప్రమాదకరమైన రోగులు, అవయవ దానం, కారుణ్యమరణాలు, చిన్నపిల్లలవైద్యం, మెంటల్ పేషంట్ లు , గర్భాశయ అద్దె కేసులు(Surrogacy) , రేప్ బాధితుల కోరుకోని గర్భం తదితర సంక్లిష్టమైన కేసులలో వైద్యం కత్తిమీద సాములాంటిది. ఇలాంటి క్లిష్ట మైన కేసులలో నియమాలు తప్పకుండ వైద్యసేవలందించాలి.అవసరమైతే న్యాయసలహాతీసుకోవాలి.  
  • ప్రతి డాక్టర్ కి కనీస మెడికో లీగల్ పరిజ్ఞానం ఉండాలి.MBBS తర్వాత లీగల్ కోర్స్ లు కూడా చే స్తే మంచి మెడికో లీగల్  కెరీర్ సాధించవచ్చు. 
  • బ్రెయిన్ డెత్  నిర్ధారణ అధికారికం గా చేసిన తర్వాతే సంబంధిత  స్పెషలిస్ట్ లు అవయవాల ఆరోగ్యస్థితి ని అసెస్ చేయడానికి  ఆ బాడీని పరీక్ష చేయాలి.
 వైద్యవృత్తిలోఉన్నవారికి స్పందించే స్వభావం,మానవీయత  ఉండాలి.
వైద్యం శాస్త్రీయమైనది మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కళ !
పొరబాట్లు సహజం. కానీ నిర్లక్ష్యం క్షమింపరాని నేరం!


No comments:

Post a Comment